యువత చైతన్యంతోనే సమాజంలో మార్పు సాధ్యమన్న ఎస్పీ
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: విజయనగరం
సమాజంలో మార్పు త్రిశూల్ మరియు యువ చైతన్యంతోనే సాధ్యమని విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ స్పష్టం చేశారు. ప్రజల భద్రతను ధ్యేయంగా పెట్టుకుని పోలీస్ శాఖ అడుగులు వేస్తోందని, యువత సరైన మార్గంలో పయనించి సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. యువత తలచుకుంటే ఏ మార్పైనా సాధ్యమని ఆయన పేర్కొన్నారు.