అల్లరి నరేష్ 'రంభ ఊర్వశి మేనక' మూవీ రివ్యూ!

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: Hyderabad

అల్లరి నరేష్, సురభి జంటగా చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంలో సూరి పాత్రలో అల్లరి నరేష్ నటించారు. దేవతలు భూమిపైకి దిగిరావడం, హీరో జీవితంలో జరిగే అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఈ కామెడీ ఎంటర్టైనర్ సాగుతుంది. రాశి సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్ కీలక పాత్రలు పోషించగా, వెన్నెల కిషోర్ ఇంద్రుడిగా అలరించారు.