విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా నవరాత్రులు: నాలుగో రోజు మహా చండీదేవిగా దర్శనమిచ్చిన కనకదుర్గమ్మ
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: విజయవాడ
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయని ఆలయ పండితులు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా నవరాత్రుల నాలుగో రోజున శ్రీ కనకదుర్గమ్మ వారు సర్వాలంకార భూషితురాలై శ్రీ మహా చండీదేవి అలంకారంలో భక్తులకు దివ్యదర్శనం ఇచ్చారు. త్రిశక్తి స్వరూపిణి అయిన ఈ అమ్మవారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోయి, భక్తుల కోరికలు నెరవేరుతాయని, ఆయురారోగ్యాలు చేకూరుతాయని పండితులు స్పష్టం చేశారు. ఈ పవిత్ర దినాన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు తన్మయత్వం చెందారు.