వలసలపై ఆస్ట్రేలియా కీలక ప్రకటన మరియు వీసాలపై కఠిన నిబంధనలు

రిపోర్టర్: వెంకట్ స్థలం: ఆస్ట్రేలియా

ఆస్ట్రేలియాలో వలసలు మరియు అంతర్జాతీయ విద్యార్థుల వీసాలపై ఆ దేశ మంత్రి టోనీ బర్క్ కీలక ప్రకటన చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూర్చే వలసలకు మద్దతు ఇస్తామని, అయితే వీసా వ్యవస్థను దుర్వినియోగం చేసే వారిపై నియంత్రణ పెంచుతామని ఆయన స్పష్టం చేశారు. యోగా టీచర్ల ప్రచారం అవాస్తవమని, నిర్మాణ కార్మికుల సంఖ్య పెరిగిందని మంత్రి తెలిపారు.