విజయనగరం జిల్లాలో దారుణం: భుజాలపై కూతురిని మోసుకెళ్లిన నిర్భాగ్యపు తల్లి
రిపోర్టర్: కిరణ్
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లాలో రవాణా సౌకర్యం లేక ఓ తల్లి పడిన వేదన కలచివేసిందని స్థానికులు తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన పన్నెండేళ్ల కుమార్తెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో ఆ తల్లి కన్నీటిపర్యంతమైంది. బిడ్డను భుజాలపై ఎత్తుకుని ఏడు కిలోమీటర్లు కొండ దారిలో నడుచుకుంటూ కిందకు చేరుకుని ఆసుపత్రికి తరలించింది. గిరిజన ప్రాంతాల్ లోని ఈ దుస్థితిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి సరైన రవాణా సదుపాయాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.