పెన్షనర్లకు శుభవార్త అదనపు క్వాంటం పెన్షన్ పెంపుపై ఉత్తర్వులు జారీ
రిపోర్టర్: గోపి
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్‌లో 70 ఏళ్లు దాటిన పెన్షనర్లకు గతంలో కోతపెట్టిన 3 శాతం అదనపు క్వాంటం పింఛనును పునరుద్ధరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్‌కుమార్ మంగళవారం ఈ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నిర్ణయంతో 70 ఏళ్లు దాటిన వారికి 7 శాతంగా ఉన్న అదనపు పెన్షన్ తిరిగి 10 శాతానికి, 75 ఏళ్లు దాటిన వారికి 12 శాతం నుంచి 15 శాతానికి పెరగనుంది. డిసెంబర్ నెల పెన్షన్‌తో పాటు ఈ పెంపు జనవరి 1న లబ్ధిదారుల ఖాతాల్లో జమ కానుంది.