ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానన్న గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
రిపోర్టర్: హరి
స్థలం: కృష్ణా
గత పాలకుల మాదిరిగా పనికిమాలిన పనులు చేయడానికి తాను రాజకీయాల్లోకి రాలేదని, కేవలం ప్రజలకు సేవ చేయడమే తన ప్రధాన ధ్యేయమని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. ప్రజాసేవ లక్ష్యంగానే తాను ముందుకు సాగుతున్నట్లు ఆయన వెల్లడించారు. నియోజకవర్గ అభివృద్ధే తన ఎజెండా అని, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తానని ఆయన తేల్చిచెప్పారు.