మలయాళ దిగ్గజాలు మమ్ముట్టి మోహన్ లాల్ తో సినిమాపై గిరీష్ ఏడీ ఆసక్తి

రిపోర్టర్: హరి స్థలం: కేరళ

మలయాళ చిత్ర పరిశ్రమ దిగ్గజ నటులు మమ్ముట్టి, మోహన్ లాల్ తో కలిసి సినిమా చేయాలనే ఆసక్తి ఉందని దర్శకుడు గిరీష్ ఏడీ వెల్లడించారు. అయితే ఇద్దరు సీనియర్ స్టార్ల స్థాయికి తగిన బలమైన కథ దొరికితేనే ఈ ప్రాజెక్ట్ పై ముందుకు వెళ్తానని ఆయన స్పష్టం చేశారు. వారిద్దరితో సినిమా చేయడం భారీ బాధ్యత అని, ప్రేక్షకుల అంచనాలను అందుకోవడం చాలా కష్టమని, సరైన కథ కుదిరితేనే చర్చలు జరుపుతామని ఆయన పేర్కొన్నారు.