పాకిస్థాన్ క్రికెట్ జట్టులో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం, ఏడుగురు ఆటగాళ్ల తొలగింపు!

రిపోర్టర్: సురేష్ స్థలం: World

ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో పాకిస్థాన్ క్రికెట్ జట్టులో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం రేగింది. పేలవ ప్రదర్శనతో పాటు క్రమశిక్షణా రాహిత్యం, ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో మహమ్మద్ రిజ్వాన్ సహా ఏడుగురు సీనియర్ ఆటగాళ్లను, కోచ్‌లను పీసీబీ తప్పించింది. ఆటగాళ్ల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని అంతర్గత విచారణకు ఆదేశించింది.