తల్లులు ఉద్యోగం చేస్తే పాఠశాలల్లో ప్రవేశాలు నిరాకరణంటూ ఆరోపణ

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Bengaluru

బెంగుళూరులోని కొన్ని పాఠశాలలు తల్లిదండ్రుల వృత్తి ఆధారంగా పిల్లలకు ప్రవేశాలు నిరాకరిస్తున్నాయని ఓ రెడ్ డిట్ వినియోగదారుడు ఆరోపించారని సమాచారం. బనశంకరి ప్రాంతంలోని కొన్ని విద్యా సంస్థలు గృహిణులుగా ఉన్న తల్లుల కుటుంబాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగం చేసే తల్లుల పిల్లలకు అడ్మిషన్లు రావని కొందరు తల్లిదండ్రులు చెప్పినట్లు తెలిపారు. ఈ నిబంధనలపై విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.