భారీ పాతాళ భైరవి సెట్టింగ్‌తో ఆకట్టుకుంటున్న పలాస వినాయకుడు
రిపోర్టర్: Dinesh Panda
స్థలం: పలాస
శ్రీకాకుళం జిల్లా పలాస పట్టణంలో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. స్థానిక యూత్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ పాతాళ భైరవి సెట్టింగ్ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. గుహ లాంటి డెకరేషన్, మర్రి ఊడలు మరియు పచ్చని చెట్లతో సినిమా సెట్‌ను తలపించేలా ఈ మండపాన్ని తీర్చిదిద్దారు. మధ్యలో త్రిశూలంతో కూడిన వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.