వివిధ రాష్ట్రాలకు కొత్త బీజేపీ ఇంచార్జ్‌ల నియామకం
రిపోర్టర్: సురేష్
స్థలం: New Delhi
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం సంస్థాగత ప్రక్షాళన చేపట్టడంలో భాగంగా దేశవ్యాప్తంగా పలు కీలక రాష్ట్రాలకు కొత్త ఇంచార్జ్‌లు, సహ ఇంచార్జ్‌లను నియమించింది. తెలంగాణ బీజేపీ ఇంచార్జ్‌గా సునీల్ భన్సల్, సహ ఇంచార్జీలుగా అభయ్ పాటిల్, రేఖా శర్మలను ఖరారు చేయగా, ఏపీ ఇంచార్జ్‌గా అరవింద్ భదౌరియాను నియమించారు. తమిళనాడు ఇంచార్జీగా రామ్ మాధవ్, సహకారంగా డీకే అరుణను నియమిస్తూ హైకమాండ్ జాబితా విడుదల చేసింది.