నేరస్తులుగా చూడొద్దు: బాలల రికార్డులను తొలగించాలన్న సీజేఐ సూర్యకాంత్
రిపోర్టర్: సురేష్
స్థలం: New Delhi
చట్టపరమైన చిక్కుల్లో పడిన బాలల పాత రికార్డులను నిర్ణీత సమయంలోగా పూర్తిగా తొలగించాలని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ, నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని నేరస్తులుగా కాకుండా పిల్లలుగానే చూడాలని పిలుపునిచ్చారు. పద్దెనిమిదేళ్లలోపు వయసున్న ప్రతి చిన్నారికి నేరపూరిత ఉద్దేశం ఉండబోదని, వారి భవిష్యత్తును రక్షించేలా సమాజం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు.