దుర్గం చెరువు ఐటీ పార్కు వద్ద భారీ కొండచిలువ కలకలం

రిపోర్టర్: నరేష్ స్థలం: Hyderabad

హైదరాబాద్‌లోని దుర్గం చెరువు సమీపంలో ఉన్న ఐటీ కంపెనీల ప్రాంగణం ఎదుట భారీ కొండచిలువ ప్రత్యక్షమవడం కలకలం రేపింది. ప్రభుత్వ భూముల అమ్మకాల కోసం ఆ ప్రాంతంలో కొండలు, గుట్టలను తొలగించడం వల్లే వన్యప్రాణులు జనవాసాలలోకి వస్తున్నాయని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఒక ఐటీ ఉద్యోగి ధైర్యంగా ముందుకు వచ్చి ఆ కొండచిలువను పట్టుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.