పెద్దపల్లిలో ఉపాధి కూలీలకు కలెక్టర్ కోయ శ్రీహర్ష కీలక ఆదేశాలు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: పెద్దపల్లి

పెద్దపల్లి జిల్లాలో ప్రతి గ్రామంలో రోజుకు కనీసం అరవై మంది కూలీలకు ఉపాధి కల్పించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష స్పష్టం చేశారు. పెండింగ్లో ఉన్న ఇంకుడు గుంతలు, ఫామ్ పాండ్లు, బోర్వెల్ రీఛార్జ్ పిట్ల పనులను నవంబర్ నెలలోగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఉపాధి హామీ పథకం అమలు తీరును మెరుగుపరచాలని, ప్రజలకు సకాలంలో పనులు కల్పించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు.