ప్రజాస్వామ్య హత్యకు కుట్ర పన్నుతున్నారంటూ కేంద్రంపై ఇండియా కూటమి ఎంపీల మండిపాటు
రిపోర్టర్: రాము
స్థలం: న్యూఢిల్లీ
కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ తీరుపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీ వేదికగా నిర్వహించిన ఇండియా కూటమి ఎంపీల సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్, సీఈఐ జ్ఞానేశ్ కుమార్‌లు కలిసి దేశంలో ప్రజాస్వామ్యాన్ని హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఖర్గే ఆరోపించారు. పౌరుల ప్రాథమిక హక్కు అయిన ఓటు హక్కును కాలరాస్తున్నారని వాపోయారు. సీఈసీ రాజీనామా డిమాండ్‌తో రాజఘాట్ వద్ద ప్రార్థనలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.