గవర్నర్ చేతుల మీదుగా ప్రతిష్టాత్మక పురస్కారం అందుకోనున్న జిల్లా విద్యార్థిని
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కిష్టాపూర్ జడ్పీ హైస్కూల్ విద్యార్థిని లసెట్టి శ్వేతకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో రెండు లక్షల రూపాయల నగదు పురస్కారం దక్కింది. చదువుకో తెలంగాణ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 24న హైదరాబాద్లో జరిగే కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును అందుకోనున్నారు. గత ఎస్సెస్సీ పరీక్షల్లో శ్వేత 582 మార్కులు సాధించి జిల్లా ప్రథమ ర్యాంకు సాధించినట్లు హెచ్ఎం రాజన్న తెలిపారు.