నెట్‌వర్క్ సమస్యపై టెలికాం టవర్‌కు టెక్నీషియన్‌ను కట్టేసిన గ్రామస్తులు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: ఉత్తరప్రదేశ్
ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌లో దారుణం జరిగింది. నెట్‌వర్క్ సరిగా రావడం లేదన్న కోపంతో గ్రామస్తులు టెలికాం టెక్నీషియన్‌ను మొబైల్ టవర్‌కు తాడుతో కట్టేశారు. 5జీ సేవలు సరిగా అందడం లేదని, రెండేళ్లుగా ఇదే సమస్యతో అల్లాడుతున్నామని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగి ఐదుగురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.