విమల్ పాన్ మసాలా ప్రకటనల వివాదం: ముంబై హైకోర్టును ఆశ్రయించిన అజయ్ దేవగన్
రిపోర్టర్: విజయ్
స్థలం: ముంబై
పాన్ మసాలా ప్రకటనల కేసులో మహారాష్ట్ర ఎఫ్‌డీఏ జారీ చేసిన షోకాజ్ నోటీసును సవాల్ చేస్తూ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ముంబై హైకోర్టును ఆశ్రయించారని ఎఫ్‌డీఏ కమిషనర్ తుకారం ముండే మీడియాకు తెలిపారు. విమల్ ఇలాచీ ప్రమోషన్‌కు సంబంధించి షారుఖ్ ఖాన్, టైగర్ ష్రాఫ్‌లకు కూడా అధికారులు నోటీసులు జారీ చేశారు. స్మోక్లెస్ టొబాకో ఉత్పత్తుల తయారీ, రవాణాపై నిషేధం ఉన్నందున ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.