జపాన్‌తో టీ20 మ్యాచ్‌కు తీవ్ర వర్షం గండం
రిపోర్టర్: హరి
స్థలం: Japan
జపాన్‌తో జరగాల్సిన చారిత్రాత్మక టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌కు తుఫాన్ ముప్పు పొంచివుంది. సోమవారం తూర్పు జపాన్‌ను డుజువాన్ తుఫాన్ ముంచెత్తడంతో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచాయి. దీనివల్ల శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ చేసే అవకాశం కోల్పోయింది. టోచిగి ప్రిఫెక్చర్‌లోని సాటో ఇంటర్నేషనల్ క్రికెట్ మైదానంలో సుజుకీ కప్ పేరుతో మంగళవారం జరగాల్సిన ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల జట్లు సిద్ధమవుతున్నాయి.