విజయవాడలో భారీ సైబర్ మోసం గుట్టురట్టు: ఐదు కోట్ల బంగారం స్వాధీనం
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: విజయవాడ
విజయవాడలో భారీ స్థాయి బంగారం మరియు విదేశీ కరెన్సీ స్మగ్లింగ్ గుట్టురట్టయినట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించారు. పక్కా సమాచారంతో అధికారులు జరిపిన తనిఖీల్లో సుమారు ఐదు కోట్ల ఎనుబది నాలుగు లక్షల విలువైన అక్రమ సంపద పట్టుబడింది. బంగ్లాదేశ్ నుంచి కోల్కతా మీదుగా హైదరాబాద్కు ఈ అక్రమ రవాణా సాగుతున్నట్లు వారు స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్లో భాగంగా ఇద్దరు వేర్వేరు బృందాలను అదుపులోకి తీసుకుని ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.