చీపురుపల్లిలో వైకాపాకు భారీ షాక్: తెదేపాలోకి నలుగురు నలభై కుటుంబాల చేరిక

రిపోర్టర్: భాస్కర్ స్థలం: విజయనగరం

ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలన దక్షతను చూసే వైకాపాను వీడి తెదేపాలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం రామలింగాపురంలో నలభై కుటుంబాలు ఆయన సమక్షంలో తెదేపాలో చేరాయి. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్ లో కూటమి అభ్యర్థులను గెలిపించి సీఎం చంద్రబాబుకు కానుకగా ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.