సైన్యానికి వీడ్కోలు పలికిన రాష్ట్రపతి మాజీ ఏడీసీ మేజర్ రిషబ్!
రిపోర్టర్: విజయ్
స్థలం: India
రాష్ట్రపతి ద్రౌపది ముర్మూకు ఏడీసీగా సేవలందించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన మేజర్ రిషబ్ సింగ్ సాంబాళ్ ఆర్మీకి ముందస్తు రిటైర్మెంట్ ప్రకటించారు. కుటుంబానికి దూరం కావడం, వ్యక్తిగత జీవితంపై ఆంక్షలు ఉండటంతో 30 ఏళ్ల వయసులోనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. సుదీర్ఘ కాలం ప్రత్యేక బలగాల్లో సేవలందించిన ఆయన, వ్యక్తిగత కారణాల వల్లే యూనిఫామ్‌ను వీడాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.