శిథిలావస్థలో పెదకంచూరు పాఠశాల.. భయంతో చదువుతున్న చిన్నారులు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: పార్వతీపురం మన్యం
పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం పెదకంచూరు ప్రాథమిక పాఠశాల తీవ్ర శిథిలావస్థకు చేరింది. 1986లో నిర్మించిన ఈ భవనంలో 23 మంది విద్యార్థులు చదువుతున్నారు. తుపానులకు రేకులు ఎగిరిపోగా, మిగిలిన రేకుల నీడలోనే ప్రమాదకర పరిస్థితుల్లో పాఠాలు చెబుతున్నారు. గాలులకు రేకులు ఎవరి తలపై పడతాయోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి తక్షణమే కొత్త భవనం నిర్మించాలని కోరుతున్నారు.