భారీ ఊరట: అక్టోబర్ లో రికార్డు స్థాయిలో రెండు లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు
రిపోర్టర్: రమేష్
స్థలం: New Delhi
అక్టోబర్ నెలలో స్థూల జీఎస్టీ వసూళ్లు ఇరవై రెండు శాతానికి పైగా వృద్ధిని నమోదు చేసి రెండు లక్షల ముప్ పై ఒక్క వేల కోట్ల రూపాయలకు చేరాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దిగుమతులు మరియు దేశీయ లావాదేవీల ద్వారా రాబడులు భారీగా పెరిగినట్లు అధికారులు తెలిపారు. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే వసూళ్లలో గణనీయమైన వృద్ధి నమోదైందని, ఇది ఆర్థిక వ్యవస్థ పురోగతికి అద్దం పడుతోందని నిపుణులు స్పష్టం చేశారు.