డ్యాన్సింగ్ విత్ ఏ స్ట్రేంజర్ కాపీ వివాదంలో సింగర్లకు ఎదురుదెబ్బ
రిపోర్టర్: రాజేష్
స్థలం: లాస్ ఏంజెల్స్
ప్రముఖ గాయకులు సామ్ స్మిత్, నార్మానిల హిట్ సాంగ్ 'డ్యాన్సింగ్ విత్ ఏ స్ట్రేంజర్' కాపీ రైట్ వివాదంలో కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 2015 నాటి పాటను పోలి ఉందంటూ దాఖలైన వ్యాజ్యాన్ని కొట్టివేయాలని కోరుతూ సింగర్లు వేసిన అప్పీల్‌ను లాస్ ఏంజెల్స్ ఫెడరల్ జడ్జి వెస్లే ఎల్. హ్సు తిరస్కరించారు. ఈ అంశంపై జ్యూరీ విచారణ ఎదుర్కోవాల్సిందేనని న్యాయమూర్తి స్పష్టం చేశారు. దీనిపై తదుపరి విచారణ జరగనుంది.