రోలుగుంటలో పోలింగ్ ఏర్పాట్లపై ఎన్నికల పరిశీలకుడు రోణంకి కొరడా
రిపోర్టర్: G TAMMUNAIDU
స్థలం: రోలుగుంట
రోలుగుంట మండలంలో ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించిన ఎన్నికల పరిశీలకుడు రోణంకి గోపాలకృష్ణ ఎంపీడీఓ కార్యాలయాన్ని బుధవారం సాయంత్రం సందర్శించారు. ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని పరిశీలించి పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, బ్యాలెట్ బాక్సుల భద్రత, సిబ్బంది హాజరు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలు పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి అక్కడ చేపట్టిన భద్రతా చర్యలను క్షుణ్ణంగా సమీక్షించారు.