నిత్యావసర ధరల పెరుగుదలపై భగ్గుమన్న ఫార్వర్డ్ బ్లాక్ నేతలు

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: నారాయణఖేడ్

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో జరిగిన మీడియా సమావేశంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కన్వీనర్ చిరంజీవి మాట్లాడుతూ రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర ధరలతో పేద ప్రజలు పడుతున్న ఇబ్బందులను వివరించారు. ప్రభుత్వం స్పందించి ధరలు నియంత్రించాలని, రేషన్ బియ్యం అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.