కష్టకాలంలో బాధితులకు అండగా నిలిచిన నాయకుడి చేయూత
రిపోర్టర్: BALUGURI VENKHATAREDDY
స్థలం: వలిగొండ
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని మొగిలిపాక గ్రామానికి చెందిన మచ్చ పోషమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, పి వై ఎస్ ఫౌండేషన్ అధినేత పులిపలుపుల రాములు గౌడ్ మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి, వారి కుటుంబానికి రూ.5,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.