రాష్ట్రపతి ఏడీసీగా రాజస్థాన్ మహిళా అధికారి నవ్య షెకావత్ రికార్డు

రిపోర్టర్: కిరణ్ స్థలం: Rajasthan

రాజస్థాన్ సికార్ జిల్లాకు చెందిన మేజర్ నవ్య షెకావత్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏడీసీగా నియమితులై అరుదైన ఘనత సాధించారు. త్రివిధ దళాల నుంచి ఆర్మీ తరఫున రాష్ట్రపతికి ఏడీసీగా బాధ్యతలు చేపట్టిన మొదటి మహిళా ఆర్మీ అధికారిగా ఆమె చరిత్ర సృష్టించారు. మూడు తరాలుగా సైనిక కుటుంబం నుంచి వచ్చిన నవ్య, సీడీఎస్ పరీక్ష ద్వారా సైన్యంలోకి ప్రవేశించి కేవలం ఐదేళ్లలోనే మేజర్ స్థాయికి ఎదిగి దేశం దృష్టిని ఆకర్షించారు.