'ధరణి పేరుతో పేదల భూ హక్కులు కాలరాశారు': కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి ఫైర్

రిపోర్టర్: రాము స్థలం: Hyderabad

ఖాస్రా పహానీని తొలగించి ధరణి పేరుతో ఎస్సీ, ఎస్టీ, ఆదివాసీ మరియు బలహీన వర్గాల భూమి హక్కులను కేసీఆర్ కాలరాశారని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. భూస్వాముల భూములను దున్నుకుంటూ జీవించిన నిరుపేదల హక్కులను ఒక్క కలం పోటుతో ప్రశ్నార్థకం చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని ఆయన మండిపడ్డారు. భూమిని నమ్ముకున్న పేదలకు భరోసా ఇవ్వాల్సిన పాలనలో దోపిడీ జరిగిందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన భూ విధానాలపై అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు.