గోపాలపురంలో వరద బీభత్సం: ఆర్టీవో ఆనందరావుతో పాటు జలదిగ్బంధంలో చిక్కుకున్న ప్రజలు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: గోపాలపురం

గోదావరి జిల్లాల్ లో కురిసిన భారీ వర్షాలకు తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం ప్రాంతం జలదిగ్బంధంలో చిక్కుకుందని అధికారులు తెలిపారు. ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు వెళ్లిన కొవ్వూరు ప్రాంతీయ రవాణా అధికారి ఆనందరావు మార్కెట్ యార్డులో వరద ఉధృతిలో చిక్కుకున్నారు. కొండల నుంచి భారీగా నీరు రావడంతో కార్లు, ద్విచక్రవాహనాలు, పలు పశువులు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురికాగా, సహాయక బృందాలు రంగంలోకి దిగి రక్షణ చర్యలు ముమ్మరం చేశాయని అధికారులు వెల్లడించారు.