గురువులపై వైకాపా దాడి జగన్ నేర మనస్తత్వాన్ని బయటపెట్టింది
రిపోర్టర్: వెంకట్
స్థలం: అమరావతి
గురువులను మద్యం దుకాణాల వద్ద కాపలా పెట్టిన వైకాపా అధినేత జగన్ ఉపాధ్యాయులను గౌరవిస్తారని అనుకోవడం భ్రమ అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ మండిపడ్డారు. అమరావతిలో శాప్ కార్యాలయం వద్ద మెగా డీఎస్సీ క్రీడా కోటా ఉపాధ్యాయులపై వైకాపా రౌడీషీటర్లు, గంజాయి బ్యాచ్ దాడికి దిగడం దుర్మార్గమని ఆరోపించారు. పూజించాల్సిన గురువులపై రాడ్లు, కర్రలతో దాడి చేసిన క్రిమినల్ గ్యాంగ్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.