పొట్లపల్లి గ్రామంలో పరిశుభ్రత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టిన సర్పంచ్
రిపోర్టర్: Damidi Chandra Reddy
స్థలం: హుస్నాబాద్
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామంలో సోమవారం రోజున స్థానిక సర్పంచ్ రాచపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పరిశుభ్రత పచ్చదనం లో భాగంగా గ్రామంలో మురికి కాలువల్లో మరియు గడ్డి పై స్ప్రే మందులను పిచికారి చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రజలు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.