కావలి మండల పరిషత్ ఎన్నికల పోరు: నామినేషన్ల దాఖలు జోరు

రిపోర్టర్: రాము స్థలం: కావలి

కావలి మండల పరిషత్లోని పదిహేను ఎంపీటీసీ స్థానాలకు ఇప్పటివరకు నలభై మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. గురువారం ఒక్కరోజే ముప్పై ఒక్క మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఇందులో పదహారు మంది తెలుగుదేశం పార్టీ నుంచి, పదమూడు మంది వైకాపా నుంచి, జనసేన మరియు భారతీయ జనతా పార్టీల నుంచి చెరో నామినేషన్ దాఖలైనట్లు అధికారులు స్పష్టం చేశారు.