తీరానికి తీవ్ర తుఫాను ముప్పు: విజయవాడలో ముందస్తు పునరావాస కేంద్రాల ఏర్పాటు
రిపోర్టర్: సతీష్
స్థలం: విజయవాడ
అర్నబ్ తుపాను ముప్పు నేపథ్యంలో విజయవాడ నగర పాలక సంస్థ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. భారీ వర్షాల హెచ్చరికలరీత్యా కొండ ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. నగరంలో ముప్పై పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి అధికారులకు సహకరించాలని హోంమంత్రి అనిత సూచించారు. వదంతులు నమ్మవద్దని అధికారిక సమాచారం అనుసరించాలని మంత్రి కోరారు.