వైభవంగా పైడితల్లి సిరిమానోత్సవం: జోరువానలోనూ తరించిన భక్తజనం

రిపోర్టర్: కృష్ణ స్థలం: విజయనగరం

విజయనగరం ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం వరుణుడి జల్లులు, వేల మంది భక్తుల మొక్కుల నడుమ మంగళవారం కనులపండువగా సాగిందని అధికారులు తెలిపారు. పూసపాటి వారసుడు అశోక్ గజపతిరాజు దంపతులు పట్టువస్త్రాలు సమర్పించగా, పూజారి బంటుపల్లి వెంకటరావు సిరిమానును అధిరోహించారు. ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేయగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉత్సవం ముగిసిందని వెల్లడించారు.