పంతంగి గణనాథుడి లడ్డూ వేలంలో రికార్డు ధర పలికింది

రిపోర్టర్: Chinukani Yuvaraju స్థలం: చౌటుప్పల్

చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో శివాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన గణనాథుడి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన లడ్డూ వేలం పాటలో గ్రామ మాజీ సర్పంచ్ బాతరాజు సత్యం రూ.1,75,116లకు లడ్డూను కైవసం చేసుకున్నారు. భక్తుల నామస్మరణ మధ్య గణనాథుడి శోభాయాత్ర అత్యంత వైభవంగా సాగింది.