ఖమ్మం మామిళ్లగూడెంలో బైక్ ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

రిపోర్టర్: amudala Venkanna స్థలం: ఖమ్మం

ఖమ్మం మామిళ్లగూడెం బస్ డిపో రోడ్డులో సోమవారం బైక్ అదుపుతప్పి పడటంతో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే 108 సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు.

గాయపడిన వ్యక్తికి అక్కడే ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.