తెగిపడిన విద్యుత్ తీగలతో వణికిపోతున్న పల్లెజనం

రిపోర్టర్: G Satyam🌹 స్థలం: చింతపల్లి

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం కోడిమిసార పంచాయతీ పరిధిలోని తురుబొమ్మలు గ్రామం రోడ్డు వద్ద విద్యుత్ వైర్ తెగిపోయి ప్రమాదకరంగా మంటలతో కాలిపోతోంది. దీనివల్ల ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని స్థానిక గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు మరియు సిబ్బంది స్పందించి విద్యుత్ సరఫరా నిలిపివేసి మరమ్మతులు చేపట్టాలని, లేదంటే ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.