కోవూరులో విషాదం: భార్యతో విభేదాలతో మనస్తాపం చెంది వ్యక్తి ఆత్మహత్య

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: కోవూరు

భార్యతో విభేదాలు రావడంతో తీవ్ర మనస్తాపం చెందిన కాకుమాను రాఘవ ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కోవూరు పోలీసులు తెలిపారు. అల్లూరు మండలం పురిణికి చెందిన ఆయన కొంతకాలంగా కోవూరులోని పెళ్లకూరు కాలనీలో అద్దెకు ఉంటున్నారు. భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో ఒంటరిగా ఉంటున్న రాఘవ నాలుగు రోజుల క్రితమే బలవన్మరణానికి పాల్పడినట్లు దుర్వాసన రావడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.