మంగళగిరి ఏసీఏ స్టేడియంలో నేటి నుంచి ఉమెన్ ఆంధ్రా ప్రిమియర లీగ్ సమరం
రిపోర్టర్: విజయ్
స్థలం: మంగళగిరి
క్రికెట్ క్రీడాభిమానుల్లో సరికొత్త జోష్ నింపేందుకు మంగళగిరి ఏసీఏ స్టేడియం సిద్ధమైంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేటి నుంచి ఉమెన్ ఆంధ్రా ప్రిమియర లీగ్ అట్టహాసంగా ప్రారంభం కానుంది. వెలుగులు విరజిమ్మే ఫ్లడ్ లైట్ల మధ్య జట్లు తలపడనుండగా, వారం రోజులపాటు సాగే ఈ టోర్నమెంట్లో మొత్తం 13 మ్యాచ్లు జరగనున్నాయి. ఈ నెల 27న సాయంత్రం ఫైనల్ మ్యాచ్ జరగనుంది.