రోడ్డుపై ప్రవహిస్తున్న తాగునీరు లీకేజీని అరికట్టాలని స్థానికుల డిమాండ్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: తుర్కపల్లి

తుర్కపల్లి మండల కేంద్రంలో మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజీ కారణంగా తాగునీరు రోడ్డుపై వృథాగా ప్రవహిస్తోంది. ఎంపీడీవో కార్యాలయ గేటు వద్ద నీరు నిలవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.