మద్యం కుంభకోణం కేసు: మాజీ మంత్రి కారుమూరి కస్టడీ విచారణ వాయిదా

రిపోర్టర్: వెంకట్ స్థలం: అమరావతి

మద్యం రవాణా కుంభకోణం కేసులో వైకాపా నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మొదటి రోజు సిట్ కస్టడీ విచారణ ఎలాంటి విచారణ లేకుండానే ముగిసినట్లు ఏపీ సిట్ అధికారులు తెలిపారు. చంచల్గూడ జైలు నుంచి విజయవాడకు తీసుకొచ్చి ఆసుపత్రిలో వైద్యపరీక్షలు పూర్తి చేసేసరికి సమయం గడిచిపోవడంతో ఆయన్ను విజయవాడ జిల్లా జైలుకు అప్పగించినట్లు అధికారులు వెల్లడించారు. మంగళవారం నుంచి ఈ నెల తొమ్మిదో తేదీ వరకు ఆయనను ప్రశ్నించేందుకు సిట్ అధికారులు సిద్ధమవుతున్నారు.