డీఎస్సీలో భారీ కుంభకోణం.. సీబీఐ విచారణ జరపాలి!

రిపోర్టర్: శ్రీకాంత్ రెడ్డి స్థలం: రాష్ట్రం

డీఎస్సీ నియామకాల్లో భారీ అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వెబ్సైట్ను మ్యానిపులేట్ చేస్తూ, ఫోర్జరీ సర్టిఫికెట్లతో టీడీపీ కార్యకర్తలకు టీచర్ ఉద్యోగాలు కట్టబెడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. జూడో టోర్నమెంట్ పేరుతో ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

రాష్ట్ర జూడో అసోసియేషన్ అధ్యక్షుడిగా మంత్రి లోకేష్ బంధువు భరత్ ఉండటమే ఈ అక్రమాలకు మూలమని ఆరోపించారు. టెట్, డీఎస్సీ పరీక్షలు లేకుండానే ఉద్యోగాలు అమ్ముకుంటున్నారని, ఈ వ్యవహారంపై తక్షణమే సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.