బోనకల్లో నిబంధనలు ఉల్లంఘించిన ఇద్దరు డీజే నిర్వాహకులపై కేసు నమోదు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: బోనకల్

ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో శనివారం రాత్రి జరిగిన వినాయక నిమజ్జన ఊరేగింపులో అనుమతులు లేకుండా డీజేలు ఏర్పాటు చేసిన ఇద్దరు నిర్వాహకులపై కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ రవి తెలిపారు. ముందస్తు అనుమతులు లేకుండా డీజేలు వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే ఉత్సవ కమిటీలకు నోటీసులు జారీ చేశామని స్పష్టం చేశారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే నిర్వాహకులతో పాటు కమిటీ సభ్యులపై కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయని ఎస్ఐ హెచ్చరించారు.