నిరుద్యోగులకు గుడ్ న్యూస్: త్వరలో ఇండియా పోస్ట్ జీడీఎస్ మొదటి మెరిట్ జాబితా
రిపోర్టర్: సతీష్
స్థలం: New Delhi
దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో ఇరవై మూడు వేల ఏడువందల ఏబై ఏడు గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి సంబంధించి మొదటి మెరిట్ జాబితా త్వరలోనే విడుదల కానున్నట్లుా ఇండియా పోస్ట్ అధికారులు వెల్లడించారు. అక్టోబర్ పదవ తేదీన ఈ జాబితా వెలువడే అవకాశం ఉందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అధికారిక వెబ్సైట్ ద్వారా సర్కిళ్ల వారీగా అభ్యర్థులు పీడీఎఫ్ ఫైళ్లను డౌన్లోడ్ చేసుకొని తమ పేర్లను పరిశీలించుకోవచ్చని అధికారులు తెలిపారు.