అమెరికా బలగాలపై దాడి చేయబోమన్న హూతీలు

రిపోర్టర్: విజయ్ స్థలం: World

యెమెన్‌కు చెందిన హూతీలతో అమెరికా ఎల్లప్పుడూ సంప్రదింపులు జరుపుతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. అమెరికా సైనిక బలగాలు మరియు వాణిజ్య నౌకలపై దాడులు చేయబోమని హూతీలు అంగీకరించినట్లు ఆయన తెలిపారు. అయితే ఈ ఒప్పందం కేవలం అమెరికా ప్రయోజనాలకే పరిమితం కాగా, సౌదీ అరేబియాకు మాత్రం ఎలాంటి రక్షణ కల్పించకపోవడం గమనార్హం. సౌదీపై హూతీల దాడులు కొనసాగుతున్నప్పటికీ వాషింగ్టన్ కేవలం నిఘా సహాయం మాత్రమే అందిస్తామని స్పష్టం చేసింది.