నెల్లూరు జీజీహెచ్లో అలంకారప్రాయంగా మారిన అగ్నిమాపక పరికరాలు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: నెల్లూరు
నెల్లూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని చిన్నపిల్లల వార్డులో ఇటీవల షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగింది. ఆసుపత్రిలోని వివిధ వార్డుల్లో ఏర్పాటు చేసిన అగ్నిమాపక పరికరాలు నిర్వహణ లేక పూర్తిగా నిరుపయోగంగా మారినట్లు అధికారులు గుర్తించారు. కరోనా సమయంలో ఏర్పాటు చేసిన ఈ పరికరాలు తుప్పుపట్టి పనికిరాకుండా పోవడంతో, కొత్త పరికరాల ఏర్పాటు కోసం కలెక్టర్కు నివేదిక పంపినట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కే మాధవి తెలిపారు.