బాన్సువాడలో దారుణం: అత్తపై కర్రతో దాడి చేసిన అల్లుడు
రిపోర్టర్: అశోక్
స్థలం: బాన్సువాడ
కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం బీర్కూర్ మండల కేంద్రంలో కుటుంబ తగాదాల నేపథ్యంలో అత్తపై అల్లుడు కర్రతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడని స్థానిక పోలీసులు తెలిపారు. భార్యను వేధిస్తున్నాడంటూ నిలదీసిన అత్త పోశవ్వపై సతీష్ ఆగ్రహంతో విరుచుకుపడి తలపై కొట్టడంతో ఆమెను బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధితురాలి కుమార్తె సుమలత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.